గర్భిణీలకు తప్పని డోలి మోతలు
NEWS Oct 23,2024 06:12 pm
ఆధునిక యుగంలో కూడా ఆదివాసీలకు డోలి మోతల తిప్పలు తప్పడం లేదు. అనంతగిరి మండలంలో ఓ నిండు గర్భిణీని కొండ శిఖర గ్రామం నుండి డోలి సహాయంతో హాస్పిటల్ కు తరలించిన దృశ్యాలు కలచివేస్తున్నాయి. గుమ్మ పంచాయతీ పరిధి కర్రి గోడ గ్రామానికి చెందిన కొర్ర రాధ (25) గర్భిణీకి బుధవారం పురిటి నొప్పులు వచ్చాయి. గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆమెను డోలి సహాయంతో అతి కష్టంతో హాస్పిటల్‌కు తరించారు. అధికారులు తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.