Logo
Download our app
భూ సర్వే త్వరగా పూర్తి చేయాలి
NEWS   Oct 23,2024 05:13 pm
NH63 నిర్మాణం కోసం చేస్తున్న భూ సేకరణ పనులను అధికారులు సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ కోరారు. కోరుట్ల మండలం మోహనరావుపేట్, జగిత్యాల మండలంలో తాటిపల్లి శివారులో జాతీయ రహదారుల అధారిటీ అదికారులు చేస్తున్న సర్వేను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని, రోడ్డు నిర్మాణంలో రైతులు, ప్రజలు ఇబ్బంది పడకుండా చేపట్టాలని, రహదారి నిర్మాణంలో కోల్పోతున్న భూమి, ఇండ్లు, బోర్లు, పైపులైన్లు, ఇతర నిర్మాణాలను పరిశీలించి, నష్ట పరిహార అంచనా పూర్తి చేయ్యాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source