బోరు నుంచి ఉబికి వస్తున్న గంగా
NEWS Oct 23,2024 06:48 am
రొళ్ల మండలం ఎం.రాయపురం గొల్లట్టి గ్రామానికి చెందిన రైతు రామన్న పొలంలో బోరు బావి నుండి పాతాళ గంగ ఉబికి వస్తోంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు, కుంటలు, చెక్ డ్యాములు, చెరువుల నిండి పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా బోరు నుంచి నిరు బయటకు వెదజల్లుతోంది. ఈ దృశ్యాన్ని వీక్షించుటకు చుట్టుపక్కల ప్రజల తండోపతండాలుగా వస్తున్నారు.