ఏసీబీకి పట్టుబడ్డ లైన్ ఇన్స్పెక్టర్
NEWS Oct 23,2024 09:56 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. విద్యుత్ మీటర్ కనెక్షన్ విషయమై 26,000 రూపాయలను లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు డిమాండ్ చేశారు. ఇంటి యజమాని ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి 26 వేలు లంచం తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమేష్, సిబ్బంది వెల్లడించారు.