పొంగులేటి జన్మదినo సందర్భంగా కబడ్డీ పోటీలు
NEWS Oct 23,2024 06:55 am
పొంగులేటి.శ్రీనివాసరెడ్డిగారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 28, 29, 30 తేదీలలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగే కబడ్డీపోటీల నిర్వహణ ఏర్పాట్లను భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచర్ల.చంద్రశేఖర్ రావు, ఆళ్ళ.మురళి, పెదబాబు, కార్తీక్, పూణెం శ్రీనివాస్, Y.శ్రీనివాసరెడ్డి, బాలపాసి తదితరులు పాల్గొన్నారు.