గంగవ్వ, రాజుపై కేసు
NEWS Oct 23,2024 06:15 am
బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ, యూట్యూబర్ రాజుపై కేసు నమోదైంది. గంగవ్వ, రాజు మై విలేజ్ షో ఛానెల్లో మే 20, 2022న చిలుక పంచాంగం వీడియో పేరుతో చిలుకను బంధించారని.. ఇది వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ జగిత్యాల అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ ప్రారంభించినట్లు ఎస్ఆర్ పి. పద్మారావు చెప్పారు.