Logo
Download our app
అక్రమంగా మట్టి తవ్వకాలు
NEWS   Oct 23,2024 08:20 am
ఖమ్మం జిల్లా: కల్లూరు మండలం చెన్నూరు నుంచి ఎర్రబోయినపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న మామిడి తోటలో బుధవారం కొందరు అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు తెలిపారు. అలాగే మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు అతివేగంగా వెళుతూ వాహనదారులను స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని అన్నారు. కావున మండల అధికారులు స్పందించి అనుమతులు లేకుండా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source