కార్యకర్త కుటుంబానికి బిజెపి అండ
NEWS Oct 23,2024 04:34 am
మల్యాల మండల కేంద్రానికి చెందిన బిజెపి కార్యకర్త జిల్లెల్ల రమేష్ భార్య మీనాక్షి గత మూడేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే రమేష్ ఆమె వైద్యానికి ఇప్పటికే అధిక మొత్తంలో ఖర్చు చేసి, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని తెలుసుకున్న బిజెపి మల్యాల మండల అధ్యక్షుడు నేరెళ్ల శ్రావణ్, పార్లమెంట్ కమిటీ ఆదేశాల మేరకు శ్రావణ్ తన సొంత ఖర్చులతో మీనాక్షి అంతక్రియలు దగ్గరుండి నిర్వహించారు.