రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
NEWS Oct 23,2024 04:32 am
రాజంపేట: కడప జిల్లా బయనపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యార్థుల క్రీడా పోటీలకు ఎంపికలో మంగళవారం రాజంపేట మండలం ఆకేపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఖోఖో అండర్ 14 విభాగంలో శ్రీనిజ, అండర్ 17 విభాగంలో మౌలాలి ఎంపిక అయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పిడి పెంచలమ్మ తెలిపారు. త్వరలో గుంటూరులో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని వారు తెలిపారు.