రోడ్డెక్కిన పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబాలు
NEWS Oct 23,2024 04:27 am
శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజల జీవితాలకు, రాజకీయ నాయకుల ఆస్తులకు,రక్షణ కల్పిస్తున్న పోలీసు కుటుంబాలు రోడ్డెక్కారు. వరంగల్ జిల్లా మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాలు నిరసనలు వ్యక్తం చేశాయి. కానిస్టేబుళ్లను వెట్టిచాకిరి చేయిస్తూ, కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా, కుటుంబానికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకోలు నిరసనను ఆపేందుకు ఆర్టీఓ ఆఫీస్ నుండి మామునూరులో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.