గంగవ్వకు గుండెపోటు వచ్చిందా?
NEWS Oct 22,2024 01:49 pm
మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వకు బిగ్‌బాస్ హౌజ్‌లో గుండెపోటు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదని ‘మై విలేజ్ షో’ టీం సభ్యుడు అంజిమామ క్లారిటీ ఇచ్చాడు. తాము షో నిర్వాహకులకు కాల్ చేయగా అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారన్నారు. గతంలోనూ గంగవ్వకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు. బిగ్‌బాస్ సీజన్-4లో గంగవ్వ పాల్గొనగా, తాజాగా మరోసారి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.