Logo
Download our app
రూ.10 నాణేలపై బ్యాంక్ మేనేజర్ క్లారిటీ
NEWS   Oct 22,2024 07:20 am
హైదరాబాద్: రూ.10 నాణేలు చట్టబద్ధమైనవని, వీటిని రోజువారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చని ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ బ్రాంచ్ వద్ద 10 రూపాయల నాణేలు చలామణిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తమ ఖాతాదారులకు 10 రూపాయల నాణేలు వినియోగించాలని సూచిస్తున్నామని, ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో ఈ నాణేలు చెల్లుబాటు అవుతున్నాయన్నారు. ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులు ఈ నాణేలను జీఎం చేతుల మీదుగా అందుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source