Logo
Download our app
విషం తాగిన గురుకుల విద్యార్థిని
NEWS   Oct 22,2024 06:41 am
రామసముద్రం కస్తూరిబ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని సోమవారం రాత్రి స్కూల్లోనే విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చెంబకూరు పంచాయతీకి చెందిన ఆమె తను ఉంటున్న గదిలోనే విషం తాగింది. తోటి విద్యార్థులు అధ్యాపకులకు సమాచారం ఇవ్వడంతో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా ఆ విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధిత విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ ఆరా తీశారు.
⚠️ You are not allowed to copy content or view source