పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS Oct 21,2024 06:57 pm
వేల్పూర్ మండల కేంద్రంలోని 1992-93 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సోమవారం శుక్రవారం దేవి ఆలయం వద్ద పూర్వ విద్యార్థులు అందరు కలిసి సందడి చేశారు. పాఠశాలలోని బాల్యపు చిలిపి చేష్టలు, మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. పూర్వ విద్యార్థులంతా కలిసి తమకు విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సన్మానించారు.