కేసీఆర్ నన్ను పక్కన పెట్టారు: కడియం
NEWS Oct 21,2024 12:00 pm
కల్వకుంట్ల కుటుంబం పదేళ్ళ పాటు రాష్ట్రం మీద పడి దోచుకుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కల్వకుంట్ల కుటుంబం దోపిడిని ప్రశ్నించాననే అక్కసుతో నన్ను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు బీఆర్ఎస్ అంటే పార్టీ కాదని.. బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్ అని అన్నారు. దమ్ముంటే 2014 లో కేసీఆర్ ఆస్తులు ఎంత ఉన్నాయో.. ఇప్పుడు ఎంత ఉన్నాయో వెల్లడించాలని సవాల్ చేశారు. అంత నీతిమంతులు అయితే వారి ఆస్తుల వివరాలు బయట పెట్టాలని కడియం డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని.. వారి మాటలు నమ్మితే నష్టపోతామని ప్రజలకు సూచించారు.