ఖమ్మం రైల్వే స్టేషన్ ఎంపీ పరిశీలన
NEWS Oct 21,2024 12:20 pm
ఖమ్మం రైల్వే స్టేషన్‌ను ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పరిశీలిస్తున్నారు. ప్రయాణికుల విశ్రాంతి హాల్, ఫుట్ వేర్ బ్రిడ్జి, ఎస్క్ లేటర్, ఎలివేటర్ తదితర నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రయాణికుల వాహనాల పార్కింగ్ ప్రదేశం, ప్లాట్ ఫామ్ లు, స్టేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశం కలియతిరిగారు. ఈ సందర్భంగా సంబంధిత రైల్వే అధికారులకు, నిర్మాణ కాంట్రాక్టర్‌కు ఎంపీ రఘురాం రెడ్డి పలు సూచనలు చేశారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.