Logo
Download our app
ఫేక్ ఐడితో లోన్.. ఖంగు తిన్న రైతు
NEWS   Oct 21,2024 11:33 am
క్రాప్ లోన్ తీసుకుందామని వెళ్లిన ఓ రైతుకు బ్యాంక్ అధికారులు షాకిచ్చారు. ఆ రైతు పేరుపై ఇదివరకే 20 లక్షల లోన్ ఉందని చెప్పడంతో రైతు కంగుతిన్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకోగా న్యాయం చేయాలంటూ బాధితుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. బుగ్గారం మండలంలోని మద్దునూరు గ్రామానికి చెందిన ముంజాల నారాయణ పేరుపై ఫేక్ ఐడితో మరొకరు లోన్ తీసుకున్నారు. ఆధార్‌లో ఫోటో మార్చి ఫేక్ ఐడితో లోన్ తీసుకున్నట్లుగా బాధితుడు ఆరోపించాడు. న్యాయం చేయాలంటూ ప్రజావాణిలో కలెక్టర్‌కు పిర్యాదు చేసాడు.
⚠️ You are not allowed to copy content or view source