బాలసుబ్రమణ్యం విగ్రహానికి నివాళులు
NEWS Oct 21,2024 08:45 am
శివంపేట మండలం పిల్లుట్ల వద్ద జరిగిన మందు పాతరకు బలైన తూప్రాన్ డిఎస్పి అవ్వరు బాలసుబ్రమణ్యం విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తాలో గల బాలసుబ్రమణ్యం విగ్రహానికి పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ సందర్భంగా డిఎస్పి వెంకట్ రెడ్డి, ఎస్ఐ శివానంద, పోలీస్ సిబ్బంది, జర్నలిస్టులు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.