రేషన్ కార్డులో పేరు చేర్చలేదా..?
NEWS Oct 21,2024 04:39 am
TG: రేషన్ కార్డుల్లో అర్హుల పేర్లను చేర్చాలని లక్షల కుటుంబాలు మీసేవా కేంద్రాల ద్వారా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేకపోవడంతో పౌరసరఫరాల శాఖ ఇన్నాళ్లూ ఆయా దరఖాస్తులను పరిశీలించలేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11.08 లక్షల దరఖాస్తులు అందగా, లబ్ధిదారుల పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చలేదు. త్వరలోనే పరిష్కారం లభించనున్నట్లు పౌరసరఫరాలశాఖ వర్గాలు చెప్పాయి.