నేటి నుంచి ఎస్ఏ-1 పరీక్షలు: డీఈవో
NEWS Oct 21,2024 03:52 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సోమవారం నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వరాచారి తెలిపారు. ఉదయం 1 నుంచి 5, 6, 8, 10 తరగతులకు, మధ్యాహ్నం 7,9 తరగతులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నవంబర్ 2న జవాబు పత్రాల మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని తెలిపారు.