నేడు కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం
NEWS Oct 21,2024 03:47 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ప్రజలు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.