Logo
Download our app
BRS రైతులకు ఏం న్యాయం చేసింది?
NEWS   Oct 21,2024 03:52 am
ఎల్లారెడ్డిపేట మండలంలో రైతులకు ఏం న్యాయం చేశారని బిఆర్ఎస్ పార్టీ ధర్నా చేసిందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య ఆదివారం ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆదివారం నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తానని ఒక లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయలేక చేతులెత్తేసిందన్నారు. గిట్టుబాటు ధర కూడా రైతులకు కల్పించలేకపోయిందన్నారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడానికే బిఆర్ఎస్ పార్టీ ఈ ధర్నాలకు దిగుతోందంటూ విమర్శించారు.
⚠️ You are not allowed to copy content or view source