కొండగట్టు దొంగలమర్రి వద్ద రోడ్డు ప్రమాదం
NEWS Oct 20,2024 05:05 pm
మల్యాల మండలంలోని దొంగల మర్రి వద్ద బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో మండలంలోని బాల్వంతాపూర్ కు చెందిన చిర్ర అభికి తీవ్ర గాయాలు కాగా, గుడిపేటకు చెందిన కుసుమ రాముకు ప్యాక్చర్స్ అయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది జ్యోతి, అనిల్ ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని జగిత్యాల సివిల్ హాస్పిటల్ కి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.