శతకాలతో రెచ్చిపోయిన రేవంత్,హర్షవర్థన్
NEWS Oct 20,2024 04:47 pm
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రా – మేఘాలయ జట్ల మధ్య సీకే నాయుడు అండర్ 23 పురుషుల క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు గోకరాజు లైలా గంగరాజు క్రికెట్ స్టేడియంలోని డీవీఆర్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన మేఘాలయ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో కె.రేవంత్ రెడ్డి (158 బంతుల్లో 186 పరుగులు),హర్షవర్ధన్ (187 బంతుల్లో 149 పరుగులు) సెంచరీలతో రెచ్చిపోయారు.