జగిత్యాల టు ముంబైకి రైలు పున:ప్రారంభం
NEWS Oct 20,2024 04:13 pm
జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేట రైల్వే స్టేషన్ నుంచి ముంబై దాదర్ వరకు రైలు సర్వీసులు పున: ప్రారంభం అయింది. ప్రతి బుధవారం సా. 5:46 గంటలకు రైలు బయలుదేరి గురువారం మ. 1:25 కు దాదర్ చేరుకుంటుందని, తిరిగి ఇదే రైలు గురువారం ముంబై నుంచి మధ్యాహ్నం 3:25 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 11:49కు జగిత్యాల చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.