సుబ్బారాయుడుకు శేఖర్ రెడ్డి నివాళి
NEWS Oct 20,2024 03:45 pm
ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లి పత్రపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ బుడ్డే సుబ్బారాయుడు ఆదివారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు మేడా విజయ శేఖర్ రెడ్డి. కార్యక్రమంలో రాజంపేట యువత అధ్యక్షుడు రాము యాదవ్, ఎల్లంరాజు పల్లి శ్రీనివాసుల రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.