మల్లాపూర్: BRS ఆధ్వర్యంలో నిరసన
NEWS Oct 20,2024 03:28 pm
ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో మల్లాపూర్ మండల కేంద్రంలో BRS ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఇప్పటివరకు రైతుల ఖాతాలో జమ చేయకుండా రైతులను మోసం చేసిందని అన్నారు. మోసపూరిత హామీలను ఇచ్చి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.