కిష్టాపూర్ గ్రామస్తులకు ఎస్ఐ కౌన్సిలింగ్
NEWS Oct 20,2024 03:47 pm
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో తూప్రాన్ ఎస్ఐ శివానందం కౌన్సిలింగ్ నిర్వహించారు. నిన్న బాణామతి చేస్తున్నారంటూ భూమొల్ల కమలమ్మ, కొడుకు స్వామి, కోడలు నవనీతలపై దాడులు చేశారు. దాడుల నేపథ్యంలో ఎస్ఐ శివానందం గ్రామస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని, దాడులు చేస్తే కఠినంగా శిక్షలు ఉంటాయని హెచ్చరించారు