Logo
Download our app
అన్నను హత్య చేసిన తమ్ముడు
NEWS   Oct 20,2024 02:18 pm
మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామంలో సొంత అన్నను తమ్ముడు కత్తితో దాడి చేసి చంపినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం అన్న పల్లెపు సాయిలు, తమ్ముడు పల్లెపు చందు మధ్య గత కొద్ది రోజుల నుండి ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం గ్రామ శివారులో అన్న సాయిలు ను తమ్ముడు చందు తల్వార్ తో దాడి చేసి చంపినట్లు ఎస్సై తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source