జర్నలిస్టుపై దాడి సిగ్గుచేటు: పల్నాటి
NEWS Oct 20,2024 02:27 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నిరంతరం ప్రజల కోసం తమ కలాన్ని అక్షరాలుగా మార్చుతూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ నిజాలను వెలికితీసే జర్నలిస్టులపై కొందరు దుండగులు, అరాచక శక్తులు దాడులు చేయడం సిగ్గుచేటని జాతీయ వినియోగదారుల, మానవ హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి పల్నాటి ప్రశాంత్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విలేకరులతో మాట్లాడారు.