BRS ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
NEWS Oct 20,2024 09:09 am
సంగారెడ్డి: ఎకరానికి 15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ తీరుని ఎండగడుతూ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు, సదాశివపేట మండల పార్టీ అధ్యక్షులుపెద్ద గొల్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో సదాశివపేట మండల BRS పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేశారు. కాంగ్రెస్ పార్టీ మోస పూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.