ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS Oct 20,2024 09:05 am
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షుడు జాగీరపు మోహన్ రెడ్డి ప్రారంభించారు. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గడ్డం మల్లేష్, డైరెక్టర్లు సోమ్ గంగాధర్, రాజారపు రాజేశ్వర్, గుమ్మాల చిన్న గంగాధర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.