మల్యాలలో యువకుడి ఆత్మహత్యాయత్నం
NEWS Oct 20,2024 08:02 am
మల్యాల మండల కేంద్రానికి చెందిన భైరి చందు అనే యువకుడు శనివారం ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు యువకుడు మిత్రులకు వీడియో కాల్ ద్వారా తెలిపాడు. అయితే గాలింపు చర్యలు చేపట్టగా మార్కెట్ యార్డ్ సమీపంలోని మల్లె గుట్ట వద్ద గడ్డి మందు తాగి పడి ఉన్న చందు ఆచూకీ లభించింది. వెంటనే 108 వాహనంలో జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, సీరియస్ ఉండడంతో హైదరాబాద్ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.