కలెక్టర్ దృష్టికి పలు సమస్యలు: ఎంపీపీ
NEWS Oct 20,2024 04:29 am
అనంతగిరి మండలంలో నెలకొన్న సమస్యలను ఎంపీపీ శెట్టి నీలవేణి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దృష్టికి తీసుకొని వెళ్లారు. గిరిజన సంక్షేమ హాస్టల్ లలో హెల్త్ వర్కర్ లను ఏర్పాటు చేయాలనీ, డైలీ వెజ్ వర్కర్స్ నియమించాలని కొరారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన రహదారులు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలనీ కోరారు. చిలకళగెడ్డ పంచాయతీ జీలుగులు పాడు వంతెన పూర్తి చేయాలనీ కోరారు. గరుగుబిల్లి చంపవతి నది పై వంతెన, హెక్టగూడ వంతెనకి నిధులు మంజూరు చేయాలనీ కోరారు.