3 రోజుల్లో 541 కోట్ల మందు తాగేశారు!
NEWS Oct 19,2024 04:39 pm
ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత మందు బాబులు పండుగ చేసుకుంటున్నారు. 3 రోజులకే రూ. 541 కోట్ల మేర మద్యం అమ్ముడు పోయింది. 7 వేల 943 మంది వ్యాపారులు మద్యం స్టాక్ తీసుకెళ్లారు. 3 రోజుల్లో లక్షా 94 వేల 261 బీర్ల అమ్మకాలు జరిగాయి. 6 లక్షల 77 వేల 511 కేసుల లిక్కర్ అమ్ముడు పోయింది. జగన్ ప్రభుత్వంలో దొరికిన మద్యం బ్రాండ్లను రద్దు చేయడంతో పాటు పాత మద్యాన్నే అమ్మడంతో మందుబాబులు ఎగబడి మరి కొనుగోలు చేశారు.