వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: VHP
NEWS Oct 19,2024 04:20 pm
రాష్ట్రంలో హిందు ఆలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ మెట్‌పల్లి పట్టణంలో ఆర్డీవో కార్యాలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఆలయాలపై దాడులు జరుగుతున్న సీఎం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు తుకారం, భాస్కర్, రాజశేఖర్, శ్రీనివాస్, నరేశ్, మోహన్, సత్యనారాయణ, రామ్ గోపాల్ తదితరులున్నారు.