Logo
Download our app
ప్రియాంకపై పోటీ చేసే బీజేపీ అభ్యర్థి
NEWS   Oct 19,2024 03:26 pm
కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. నవ్య హరిదాస్‌ను బీజేపీ ఇక్కడి నుంచి బరిలోకి దింపుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంకగాంధీ పోటీ చేస్తున్నారు. వయనాడ్ నుంచి ప్రియాంకపై పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కోజీకోడ్ కార్పోరేషన్ కౌన్సిలర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆమె కేరళ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నవంబర్ 13న ఉప ఎన్నిక. 23న ఫలితాలు ఉంటాయి.
⚠️ You are not allowed to copy content or view source