జనసేనలోకి ముద్రగడ కుమార్తె క్రాంతి
NEWS Oct 19,2024 03:19 pm
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. క్రాంతి భర్త కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు కార్పొరేషన్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు, కొందరు జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిలర్లు కూడా జనసేనలో చేరారు. పెడన నియోజకవర్గం నుంచి ఎంపీటీసీ, పలువురు మాజీ ఎంపీటీసీలు, సర్పంచిలు పార్టీలోకి వచ్చారు.