గీతాకార్మికులకు కాటమయ్య కిట్ల పంపిణీ
NEWS Oct 19,2024 04:53 pm
భద్రాద్రి కొత్తగూడెం: వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గీతాకార్మికులకు కాటమయ్య కిట్లను పంపిణీ చేశారు. తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదాలు జరగకుండా ఈ రక్షణ కిట్లు ఉపయోగపడతాయని తెలిపారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.