వర్షానికి తడిసి ముద్దయిన వరి ధాన్యం
NEWS Oct 19,2024 05:29 pm
మెదక్ పట్టణ శివారులో శనివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. అకాల వర్షాలు అన్నదాతను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మెదక్ పట్టణ శివారులోని పిల్లి కొట్టాల వద్ద రైతులు ధాన్యం ఆరబోశారు. మధ్యాహ్నం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై భారీ వర్షం కురవడంతో ఆరబోసిన ధాన్యంపై నుంచి వర్షం నీళ్లు కాలువ మాదిరిగా పారాయి. రైతులు తిరిగి ధాన్యం ఆరబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.