ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
NEWS Oct 19,2024 01:25 pm
జగిత్యాల కలెక్టరెట్ సమావేశ మందిరంలో ఖరీఫ్ 2024-25 సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు, ఖరీఫ్, రబీ 2023-24 సీజన్ కి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ బియ్యం (సిఎంఆర్) డెలివరిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు 2 రోజుల్లో ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాలలో కావలిసిన అన్నీ వసతులు ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని అధికారులని ఆదేశించారు.