పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి
NEWS Oct 19,2024 05:00 pm
సిద్దిపేట జిల్లా రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధి నంగునూరు మండలం బద్దిపడగ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో నలుగురిని అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుంచి రూ. 24,480, ఆరు మోటారు సైకిళ్ళు, నాలుగు మొబైల్ ఫోన్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రాజగోపాల్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.