నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు సీజ్
NEWS Oct 19,2024 03:11 pm
ఖమ్మం: నెంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్న 55 బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో నగరంలో నెంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతూ పట్టుబడిన 55 ద్విచక్ర వాహనదారులతో ఏసీపీ మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనాలకు రిజిస్ట్రేషన్, నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా వుండాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు.