కోర్టు భవనాన్ని ప్రారంభించిన జడ్జి
NEWS Oct 19,2024 03:14 pm
అల్లాదుర్గం జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టును హైకోర్టు జడ్జి విజయ్ సేన్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక ప్రజల సత్వర న్యాయం కోసం కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెదక్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్ర గౌడ్ మాట్లాడుతూ.. ఈ కోర్టు ఏర్పాటుతో భవిష్యత్తులో ఈ అల్లాదుర్గం అసెంబ్లీ నియోకవర్గం కావడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి, జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.