దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
NEWS Oct 19,2024 03:15 pm
సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందించారు విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పలుచోట్ల దేవాలయాలపై కొందరు దాడులు చేస్తున్నారని వారిని పట్టుకుని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.