కోరుట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా
NEWS Oct 19,2024 01:27 pm
ఇల్లెందుల మండలంలో జర్నలిస్ట్ సుదర్శన్ రెడ్డిపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కోరుట్ల బస్టాండ్ వద్ద ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జర్నలిస్టుపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.