మంథని మండలంలో ATM దొంగలు
NEWS Oct 19,2024 04:58 pm
దొంగలు చివరికి సీసీ కెమెరాలు ఉన్న ప్రదేశాలను కూడా వదలడం లేదు. తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని మినీ ఏటీఎంలోకి ఓ ముసుగు దొంగ చొరబడ్డాడు. డబ్బు దోచుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఏటీఎంలో ఉన్న మహిళను కత్తితో బెదిరించాడు. అదే సమయం కొందరు స్థానికులు అటుగా రావడంతో దొంగ అక్కడినుంచి పారిపోయినట్టు తెలిసింది.