మైక్రో ఫైనాన్స్ లోన్ వేధింపులపై చర్యలు
NEWS Oct 19,2024 01:29 pm
సిరిసిల్ల: ఆర్బిఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా సిరిసిల్ల జిల్లాలో మైక్రో ఫైనాన్స్ లోన్ రికవరీలో వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హెచ్చరించారు. మైక్రో ఫైనాన్స్ వాళ్ళు డబ్బులు చెల్లించాలని ఇష్టం వచ్చినట్లు వేధిస్తే బాధితులు తనను కలవాలని వేధింపుదారుల నుండి రక్షణ కల్పిస్తామన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడడం సరైనదికాదని, మీపై ఆధారపడిన కుటుంబం గురించి ఆలోచించాలన్నారు.