వందేళ్లకు సరిపడేలా రాజధాని నిర్మాణం
NEWS Oct 19,2024 07:01 am
అమరావతి: రాయపూడి వద్ద అమరావతిలో రాజధాని నిర్మా ణ పనులను సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు. భవన ప్రాంగణంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పూజా కార్యక్రమం నిర్వహించారు. వందేళ్లకు సరిపడేలా రాజధానిని నిర్మిస్తున్నామన్నారు సీఎం. రూ.160 కోట్లతో గతంలో టీడీపీ హయాంలో ఏడంతస్తుల్లో సీఆర్డీఏ కార్యాలయ పనులు చేపట్టారు. మొత్తం 3.62 ఎకరాల్లో జీ ప్లస్ 7 భవనాన్ని ఇక్క డ ప్రభుత్వం నిర్మిస్తోంది.