చెడు అలవాట్లకు బానిస కావొద్దు: DSP
NEWS Oct 19,2024 07:03 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మత్తు పదార్థాలకు బానిస కావొద్దని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని మణుగూరు డీఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. బూర్గంపాడు మండలం సారపాకలో సీఐ వినయ్ కుమార్, ఎస్ఐలు పోలీసు సిబ్బందితో కలిసి కార్డన్ సర్చ్ నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు కనబడితే డయల్ 100 లేదా పోలీస్ స్టేషన్ వద్ద సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.